Archive for the ‘prema’ Category

వర్షం

Posted: April 27, 2011 by oorodu in haasyam, prema, telugu, Uncategorized
Tags: , , , , ,

కారు మబ్బులు కమ్మిన చల్లని సాయంత్రం. అలా మేడ మీద నించి మబ్బులని చూడటం అంటే నాకు చాలా ఇష్టం. దూరంగా వాహనాల చప్పుడు తప్ప నిశబ్దంగా ఉంది. సిటీలో అంత కంటే ప్రశాంతత ఆశించడం కూడా పొరపాటే. పైగా ఆమె నా పక్కనే ఉంది. ఆమె… నాలుగేళ్ళు బాయ్స్ హాస్టల్ లో ఉండి అమ్మాయిలంటే అంటరాని వస్తువులుగా, ప్రేమంటే నేరంగా చూడటం అలావాటైన నన్ను నేరస్తుడిగా (ప్రేమికుడిగా) మార్చిన ఆమె…

ఇవాళ ఎలాగైనా విషయం చెప్పెయ్యాలని నిర్ణయించుకున్నాను. “Empty vessels make more noise” అంటారు కాని దానికి converse కూడా నిజమే నని నాకు అప్పుడే అర్ధమయ్యింది. గుండె నిండా తనమీద ప్రేమతో నిండిపోయిన నా blood vessels నన్ను మూగ వాడిని చేసేసాయి… (ఇంతకూ “full vessels are mute” లాంటి స్టేట్మెంట్ contrapositive అవుతుందేమో కదూ…)

అసలే ముందు చెప్పినట్లుగా సూపర్ స్టార్ కృష్ణకి డాన్సు చేయడంలో ఎంత ప్రావీణ్యం ఉందో మనకి ఈ విషయంలో అంత టాలెంటు… ప్రేమలో పడితే సినిమాల్లో లాగా అర్ధకిలో కండ లేని హీరోలు కూడా ఆజానుబాహులైన విలన్ లను ఇరగాదీస్తారేమో నాకు తెలియదు కాని, నాలాంటి వాళ్ళు కనీసం అమ్మాయితో మాట్లాడే ధైర్యం ఐనా తెచ్చుకుంటారు. ఒక్కో సారి మానవ ప్రయత్నానికి ప్రకృతి కూడా ధైర్యం చెపుతుంటుంది. నన్ను చెప్పమంటూ తొందర పెడుతున్నట్లుగా ఒక్క ఉరుము ఉరిమింది… అదే మంచి ముహూర్తమనే ధైర్యంతో మొదలెట్టాను.

“మబ్బుడు నవ్వుతున్నాడు చూసావా?”
“మబ్బుడా…?”
అలాంటి పనికిమాలిన పదం కనిపెట్టినందుకు నా మీద నాకే కొంచెం కోపం వచ్చిన మాట నిజమే. కాని అదేదో పాటలో చెప్పినట్లు “ప్రేమను తెలిపే ధైర్యం కలవాడు దేవుడికంటే బలమైన వాడు”. ఆ క్షణంలో ఆ మాత్రం మాట పెగలడమే గొప్ప విషయమనుకుని తడబడకుండా కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించాను.
“అంటే.. మబ్బు మగాడన్నమాట!” అన్నాను ఏదో నాకొక్కడికే తెలిసిన విషయం చెప్తున్నా వాడిలా…
“ఓహో..” ఇంకా చెప్పమన్నట్లు నా వైపు చూసింది. ప్రశ్నార్ధకం అంత అందంగా ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది.
“ఉరుమంటే అతని నవ్వన్నమాట..” అని ఇందాకటి మాటకి అర్ధం చెప్పాను.
“భలే గంభీరంగా నవ్వుతాడే మన మబ్బుడు? ఇంతకీ ఇప్పుడు ఎందుకు నవ్వినట్లో?” అమాయకంగా అడిగింది. ఇక్కడి దాకా బానే ఉంది కానీ ఇక నించి ఏం మాట్లాడాలో తెలియని నా పరిస్థితి లారెన్స్ కొరియోగ్రఫీ లో జగపతి బాబులా తయారయ్యింది. ఏదో ఒకటి చెప్పాలి ఇప్పుడు…
“నువ్వేమనుకుంటున్నావ్?” అడిగాను నేను. ఆలోచించుకోవడానికి కొంచెం సమయం వస్తుంది కదా అని…
“ఏమో! నువ్వేమైనా కితకితలు పెట్టావా?” దగ్గరౌతూ నలుపెక్కుతున్న మబ్బులను చూస్తూ అడిగింది. దాంతో నేనూ ఆ వైపు చూసాను…

పైనించి ఇదంతా గమనిస్తూ నన్ను కూడా తన దగ్గరికి జరగమని సైగ చేస్తున్నట్లుగా మబ్బులు ఒకదానికొకటి దగ్గరగా జరగడం మొదలెట్టాయి. కనీ కనిపించని మసక వెలుతురు మబ్బులు కమ్ముకోవడంతో మరింత మసకబారింది. మబ్బుడి ప్రోత్సాహంతో కొంత పక్కకి జరిగిన నేను వీధి దీపాల మసక వెలుతురులో మెరుస్తున్న తన మొహం మీద నించి చూపు తిప్పుకోలేక పోయాను.

వర్షం మొదలవ్వడానికి సూచనగా మెరుపు మెరిసింది. పోటీగా ఆమె చిరునవ్వు కూడా – బ్రహ్మ స్పెషల్ గా ఏదో కోర్సు చేసి మరీ నేర్చుకున్న ఆమె “designer smile” నా మీద ప్రయోగించింది. అంతే ఇంక నా చూపులు మరల్చుకోవడం నా వల్ల కాలేదు. నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ లాగా కంటి చూపుతో చంపేసేలా ఆమెనే చూస్తూ ఉండిపోయాను…

ఇంత సేపూ తననే కళ్ళార్పకుండా బావురుకప్పలా నోరు కూడా తెరుచుకుని మరీ చూస్తున్న చూపులు గుచ్చుకున్నాయో ఏమో, ఇటు తిరిగి చూస్తూ తనే అంది:
“నాకేమిష్టమో తెలుసా?”
ఒంట్లోని రక్తమంతా గుండెల్లోకి వచ్చేసిందేమో అన్నంత వేగంగా కొట్టుకుంది నా గుండె. ఒక్కసారిగా నా గుండెలో పది హైడ్రోజెన్ బాంబులు పేలిన అనుభూతి కలిగింది. ఇంకా మంచి పోలిక ఉండచ్చేమో కాని ఆ సమయంలో నాకు అంతకంటే ఆలోచించే తెలివి లేదు. నా ప్రయత్నం ఫలించింది అనుకున్నాను. నా పేరు చెప్పెసుకుందామని అనుకుంటుండగా గుర్తొచ్చింది తను అన్నది “ఏమి” ఇష్టమో అని కానీ “ఎవరు” ఇష్టమో అన్నది కాదు అని…
“ఏమిటి?” తేరుకుని అన్నాను నేను.
“వర్షం పడే ముందు వచ్చే ఈ మట్టి వాసన” అంది. మళ్ళీ “designer smile” ప్రయోగిస్తూ…
“ఓహ్… అదా. అది నాకు కూడ ఇష్టమే. కానీ నాకు ఇంకొకటి కూడా ఇష్టం…” చెప్పకనే చెప్పెసానని గర్వంగా అన్నాను నేను.
“ఏంటి? మబ్బులు.. కాదు కాదు! మగ మబ్బుడు నవ్వడమా? ప్రొఫెసర్ గారూ..?” వెక్కిరించినట్లు అడిగింది.

ఆడవారి మాటలకు అర్ధాలే వేరు. అవసరం లేని చోట కూడా అమ్మాయి మర్యాదగా “గారూ” అందంటే ఆ అమ్మాయి సరసమాడుతోందని అర్ధం. అమ్మాయే సరసమాడాలనుకుంటే నాలాంటి అబ్బాయి ఏమీ చేయలేడని అనుకున్నాను. ఇంతకీ నేను ఏదో చెప్పానని అయినా ఆమెకి అర్ధం అయ్యిందో లేదో నా మట్టి బుర్రకు అర్ధం కాలేదు. ప్రేమ వదలని విక్రమార్కుడి లాగా మళ్లీ నాకు కావలసిన దాని వైపు సంభాషణని మరలించే ప్రయత్నంలో పడ్డాను.

“మబ్బుడు భూమిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆ నవ్వు…” అంటూ మళ్లీ ప్రేమ గురించి చెప్పడం మొదలెట్టాను.
“ఆహా…?” ఈ సారి వెక్కిరింతో అమాయకత్వమో తెలియని మరొక అందమైన హావం. ఈ దెబ్బకు నాకు గుండె పోటు ఖాయమని ఫిక్స్ ఐపోయాను…
అయినా మళ్లీ తెలివి తెచ్చుకుని చెప్పాను “భూమిని చూసిన ఆనందంతో కేరింత లాంటిదే ఈ నవ్వు. త్వరలో వర్షంగా తనను తాకబోతున్నందుకే ఉద్రేకంతో ఈ మెరుపులు.”
“మరి ఇన్నాళ్ళూ ఈ మబ్బుడు ఎక్కడున్నాడో. అంత ప్రేమించే దాన్ని వదిలేసి వెళ్లచ్చా ?” గడుసుదనం ఉట్టిపడేలా అడిగింది.
“మబ్బుడికి భూమి మరి సమాధానం చెప్పొద్దా? ఆ మొదటి వర్షం ఇచ్చే మట్టి వాసనే మబ్బుడికి భూమి సమాధానం.” ఇంత తెలివి నాకెక్కడినించి వచ్చిందో ఆ సమయంలో నాకే అర్ధం కాలేదు. ప్రేమ నించే వచ్చింది అనుకుంటాను.

ఇప్పటికైనా నాకు సమాధానం కావాలని ఆమెకి అర్ధం ఔతున్దనుకున్నాను. తనకు మాత్రం అర్ధమైపోయిన్దన్నట్లు మబ్బుడు వర్షం కురిపించడం మొదలు పెట్టాడు.
“సరే లే. అయినా రోజూ వర్షం పడటానికి నార్త్-ఈస్ట్ monsoon సంవత్సరానికి మూడు నెలలే ఉంటుంది.” అంది.
ఆ మాటతో నా ఉత్సాహమంతా నీరు కారిపోయింది “నువ్వు సూపర్ ఇంజనీర్ వి అసలు..” అని బయటకి అని,
ఇంత రొమాంటిక్ గా నేను మాట్లాడుతుంటే నార్త్-ఈస్ట్ మాన్సూన్ గుర్తు తెచ్చుకునే అమ్మాయి దొరికి నాలాంటి గీకు గాడికి తగిన శాస్తే జరిగిందని అనుకున్నాను. అసలు ఆడవారి మాటలకు అర్ధాలు వేరని చెప్పిన రచయితనీ, పైనించి దిరెక్తిఒన్ చేసిన మబ్బుడినీ, “లెగెండ్-సెలెబ్రిటి” పుస్తకం కంటే ముందు ఆడవారి మాటలకు అర్ధాలు చెప్పే పుస్తకం రాయమని కోరని మోహన్ బాబుని, రైల్వే స్టేషన్ లో “30 రోజుల్లో పోరి” అనే పుస్తకం రాయించనందుకు రైల్వే మంత్రినీ, అనవసరంగా గుర్తొచ్చినందుకు మా తెలుగు టీచర్నీ నిందిస్తున్న ఆ సమయంలో నే అనూహ్యంగా వచ్చింది మరో ఛాన్స్…

“నీ దగ్గర గొడుగు ఉందా? ఇంక నేను ఇంటికి వెళ్తాను…” అడిగింది తను.
పక్కనే ఉన్న పెద్ద పాతకాలం గొడుగుని తెచ్చి చూపించాను.
“ఇదా! చిన్న ఫోల్దింగ్ ది లేదా? ఇది వేసుకెల్లటం అంత బాగుండదు. వద్దు లే…” అంటూ బయలుదేరడం మొదలుపెట్టింది…
“ఇది పెద్ద గొడుగే లే! ఇద్దరం పడతాము. నిన్ను ఇంటి దగ్గర దించేసి రానా? నాకు ఆ వైపు పని ఉంది..” అంటూ ఆ పెద్ద గొడుగు మడత తీస్తూ చెప్పాను…తన అర్ధ-క్షణం మౌనాన్ని అర్ధాంగీకారంగా భావించి అర్ధ-గొడుగు అప్పు ఇచ్చి ముందుకి నడవటం మొదలుపెట్టాను.
పక్కనే ఉన్న హోటల్ రేడియోలోనించి సన్నగా “ప్యార్ హువా ఇక్ రార్ హువా” పాట వినిపించడం మొదలు పెట్టింది…

Pedda godugu

ఆ చిన్న గొడుగు కనిపించకుండా దాచేసి మంచి పనే చేశాను కదూ…?

Advertisements

అందమైన ప్రయాణం

Posted: March 3, 2011 by gitaneti in prema, telugu, Uncategorized
Tags: ,

నాకు ప్రయాణాలు అంటే చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తాను …అది ట్రైన్ లో ఐనా , బస్సు ఐనా,కార్ ఐనా …..
ఒంటరి ప్రయాణాలు ఇంకా ఇష్టం ….నల్లని తారు రోడ్ మీద దూసుకుపోతున్న తెల్లని బొలెరోలో …
చల్లని గాలి …ఆకాశంలో నీతో పాటు మేము వస్తాం అంటున్న మేఘాలు …..
చూస్తూ నాకు చిరునవ్వుతూ వీడ్కోలు పలుకుతూ వెనక్కి వెళ్ళిపోతున్న పచ్చటి పొలాలు , స్పీడ్ కి తగ్గ మ్యూజిక్ ……..
ఇలా అన్ని ఉన్నా ……ఈ ప్రయాణం అంత ఆహ్లాదం గా లేదు మనసుకి…..
భారంగా అనిపిస్తోంది ..బహుశా మనసు భారంగా ఉంది అనుకుంటా ……
అవును.. మనసే భారంగా ఉంది ..అంత అవసరం ఏముంది ఇపుడు అని నేనే నా మనసుకి సర్ది చెప్పి దాని నోరు నొక్కేసాను…ఆలోచనలు ఎటో వెళ్తున్నా, కళ్ళు వెంట తెచుకున్న పుస్తకాల మీద నిలపటానికి ప్రయత్నం చేశాను ……ఇంతలోగా చేరవలసిన గమ్యం రానే వచ్చింది …నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం …రాజమండ్రి లో ఉన్న గోదావరి పక్కనే ఉన్న ఒక హోటల్ ….

……………………………………………………………………………..
హోటల్ చేరగానే ఫ్రెష్ అయ్యి ….ఏదో కాస్త తిన్నాను అనిపించాను …కాస్త ముందు రాగలిగి ఉంటే ఒక సాయంత్రం గోదావరి ఒడ్డున ఉండేదాన్ని ..ఛ ..ఇక్కడ కూడా అదో నిరాశ ఎదురయ్యింది….
“ఈ చీకట్లో ఎం కనిపిస్తుంది” అనుకుంటూ గోదావరిని అనుకుని ఉన్న సిట్ అవుట్ లో కూర్చున్నా….
గోదావరి ..ఇక్కడ ఏదో మాయ ఉంది ….ఏదో ఇష్టం కలుగుతుంది ఒక సారి చూడగానే …తరచుగా రాకపోయినా …వచ్చిన ప్రతి సారీ ఇలా గోదావరిని చూస్తూ గడిపేయటం నాకు అలవాటు ..ఎన్నో కథల్లో, సినిమాల్లో దీనిని అంతగా పొగుడుతుంటే ఏమో అనుకున్నా కానీ స్వయంగా చూసాక ఒప్పుకోక తప్పలేదు …
ఇక్కడ గడిపిన ప్రతి క్షణం ఏదో ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుందని……….
నిశ్శబ్దంగా ఉన్నా నేను …కానీ మనసంతా అలజడి ….గల గల మంటూ ఏదో రహస్యం చెప్తున్నట్లు గోదావరి ..అమ్మ చేతి స్పర్శ లాంటి ఆత్మీయమైన గాలి ….నీ మనసులో ఏముందో చెప్పమంటున్నట్టు
మేమూ వింటాం అంటున్న్నట్టు ఆ చుట్టూ పక్కల చెట్లు తలలు ఊపుతున్నై …ఇంక నా కళ్ళు నా మాట వినట్లేదు ..
అనంతమైన గోదావరి లా, నా కళ్ళలో నీళ్ళు. ఇన్ని నీళ్ళు ఉన్న గోదావరి లోతు ఎంతో చెప్పొచు కానీ
అనంత్ మనసు లోతు ఎంతో , ఎందుకో నాకు తెలీదు ….గత పది రోజుల నుంచి జరుగుతున్నవన్నీ ..ఒక్కొక్కటిగా గుర్తోస్తున్నై …………………

……………………………………………………………………

నేను యే రోజు ఎవరి కోసం నా జీవితం లో ఎదురు చూడ లేదు ….23 ఏళ్ళ దాక తల ఎత్తకుండ చదువుకున్నా. ఆ పైన మంచి ఉద్యోగం ..మంచి జీతం ..ఆ పైన promotions …మధ్యలో ఎదురైనా కొద్ది పాటి పరిచయాల్ని కూడా స్నేహాలుగా మలుచుకోలేదు ..కారణం ఎప్పటికప్పుడు నా ముందు ఉన్న లక్ష్యాలు ….
కానీ ఉద్యోగంలో చేరాక బోలెడంత తీరిక ..అందరికీ స్నేహితులు ఉన్నా ..నాకు చాలా తక్కువ …
ఖాళి గా ఉండటం ఇష్టం లేక …ఇంటికి దగ్గరలో ఉన్న స్ఫూర్తి అనే ఒక అనాథ శరణాలయంలో ..10th,ఇంటర్ పిల్లలకి maths చెప్పటం మొదలు పెట్టాను ….,అక్కడే పరిచయం అయ్యాడు అనంత్ ….తను అక్కడ సైన్సు చెప్తున్నాడు ఆల్రెడీ! ఆశ్చర్యంగా అనిపించింది. ఈ నా ఆలోచన చాలా కొత్తది మరెవరికీ రాదు అనుకున్నా , పూర్తీ గా అలంటి ఆలోచనే వచ్చి దాన్ని ఆచరణలో పెట్టిన అనంత్ ని ..పరిచయం చేసారు ఆ అనాథ శరణాలయం నడుపుతున్న పెద్దాయన ….
అందమైన నవ్వు ,తెలివితేటలూ ,చలాకీతనం ,నిస్వార్థమైన సేవతో యిట్టె ఆకర్షిన్చేసాడు అనంత్ అందరినీ. చాలా తక్కువ సమయం లో ……నన్ను కూడా!
కానీ అంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చే మనస్తత్వం కాదు నాది …నేను కూడా అతనితో మాట కలపటానికి టైం తెసుకున్నా …కానీ పరిచయం స్నేహం గా మారటానికి ఎక్కువ సమయం అవసరం లేదు అని అర్ధం చేసుకోలేక పోయాను….
ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు , సినిమాల్లో చూపించినట్టు నాకేమి గుండెల్లో గంట కొట్టినట్టు కానీ , పగటి కలలు ,రాత్రి నిద్ర పట్టక పోవాటలు లాంటివి ఎం జరగలేదు ……
కానీ అలంటి మనిషి సాన్నిహిత్యం జీవితాంతం పొందటం అదృష్టం అని మాత్రం అనిపించింది ….
అందుకే నాన్న పెళ్లి ప్రస్తావన తెసుకు రాగానే అనంత్ పేరు చెప్పటానికి నేను పెద్ద గా భయపడ లేదు ..నాన్న కూడా ఎప్పుడూ ఎవరినీ సీరియస్ గా తీసుకొని నేను ఇతని విషయంలో నమ్మకంగా చెప్పటంతో అనంత్ ని కలవటానికి వెళ్లారు …ఇంక ఈ పెళ్లి ఖాయం అనుకున్నానే గని ..అనంత్ reaction నేను ఊహించలేక పోయాను ….
………………………………………………………………………………

తిరిగి వచ్చిన నాన్న మొహం చూస్తేనే అర్ధం అయింది ..ఏదో జరగా కూడనిదే జరిగింది అని …..
“అతనికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదుట అమ్మా , నువ్వు కొంచెం అతన్నిని కనుక్కుని నను పంపించి ఉంటే బావుండేది “ అన్నారు నాన్న ….
అసలు ఎం జరిగిందో అడిగే ధైర్యం చేయలేకపోయాను …కనీసం ఊహించలేకపోయాను ….
మరునాడు స్ఫూర్తి కి వెళ్ళినప్పుడు అడగాలనుకున్న కానీ తను ఎప్పటిలాగే ఏమి జరగనట్టు పలకరించే సరికి నాకు తల తిరిగిపోయింది ..కోపం వచ్చింది . .మాట్లాడలనిపించలేదు ..
క్లాసు లేదని చెప్పి బయటకి వచ్చేసాను …ఆ పరిస్థితుల పరిణామమే ఈ ఆకస్మిక ప్రయాణం ……
ఈ ఆలోచనంల్నించి నన్ను బయటకి నెడుతూ నాన్న దగ్గరి నుంచి ఫోన్ …క్షేమ సమాచారాలు అడిగి నిద్ర లోకి జారిపోయాను …బహుశా గోదావరి కి అన్ని చెప్పేసాక మనసు తేలిక పడింది ..త్వరగా నిద్ర వచ్చేసింది ……

………………………………………………………………………………….

పొద్దున్నే లేచి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి వచ్చాను , రాబోయే అమ్మా-నాన్నల పెళ్లి రోజుకి కావలసిన గిఫ్త్స్ తీసుకున్నా ..మధ్యానం తిర్గి వచేసరికి 3 అయింది …కాస్త భోజనం చేసి ..రూం లో పడుకున్నా ….
లేచేసరికి 5.30 అయింది ..త్వరగా ఫ్రెష్ అయ్యి మళ్లీ గోదావరిని సంధ్యా సమయంలో మిస్ అవ్తనేమో అని హడావిడి గా బయటికి వచ్చేసాను ….సిట్ అవుట్ పక్కనే ఉన్న restaurant లో ఒక మంచి కాఫీ కి ఆర్డర్ చేసి సిట్ అవుట్ లో కూర్చున్నా ….
ఏదో తన్మయత్వంగా గోదావరి వైపు చూస్తున్న నాకు పక్కనే ఏదో అలికిడి అయింది అని పక్కకి తిరిగి చుస్తే ..నన్ను నేను నమ్మలేక పోయాను …నవ్వుతు నా పక్కన ..అనంత్ … ..
చెప్పలేనంత ఆనందం కలిగింది కానీ మరి ఒక్క క్షణం లోనే మొహం తిప్పుకున్నాను ..తన మాటలు గుర్తొచ్చి …”ఏంటి అలిగావా ??” అంటూ న చేతికి కాఫీ అందించాడు నవ్వుతూ …
ఏం చెప్పను? ఏమని నిలదియను? ..తను అంటే నాకు ఇష్టం అని ఎప్పుడూ చెప్పలేదు ..కాబట్టి నన్ను కాదనటం లో అతని తప్పు ఏం లేదు ….”నీకు తెలియదా ?” అని ఏదో పొడుపు కథ సంధించినట్టు అడిగాను ….
అతని మొహంలో యేమాత్రం ప్రశాంతత చెదరలేదు …”నువ్వు క్లాసు కి రాలేదేమిటా అని మీ ఇంటికి వెళ్ళాను , మీ నాన్న గారు చెప్పారు ..సో కోపం నా మీదే అని అర్ధం అయింది ..”..
” ఐతే తెలిసి అడగటం దేనికి ..కోపమా అని ??”అన్నాను కఠినం గా …
“ అదే ..ఇలా కోపం రావటానికి కారణం ఏంటా అని ..తెలుసుకోవతనికే వచ్చాను” అన్నాడు నవ్వుతూ ..
అతని మాటలకి నాకు కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు …”చూడు ..నాకు నీలాగా మాట్లాడటం రాదు …నేను అందరికి నచ్చాల్సిన అవసరం లేదు …నిజమే ..నీకు కూడా నచ్చకపోయి ఉండొచ్చు ..కానీ దాని కోసం పూర్తీ గా పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని అబద్ధం చెప్పటం దేనికి ?? ఎందుకు నచ్చలేదో ఒక్క కారణం చెప్తే అర్ధం చేస్కో లేనంత చిన్న పిల్లని ఏం కాదు ..” అన్నాను వచ్చే ఏడుపుని ఆపుకునే ప్రయత్నం చేస్తూ …
నా కళ్ళలో నీళ్ళు ..తను ఊహించినవే అన్నట్టు ..నా చేయి పట్టుకుని కూర్చోపెట్టి ..దగ్గరకు జరిగి ..చెప్పటం మొదలు పెట్టాడు …” అసలు నువ్వు నచ్చలేదని ఎవరు అన్నారు …చూడగానే ఎవరికైనా నచ్చుతావ్ , మంచి చదువు ..అంతకు మించిన సంస్కారం ఉన్న దానివి ..నిన్ను కాదని అనే వాళ్ళు ఎవరూ ఉండరు ..కానీ నాకు నిజం గానే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు …ఇది ఇవాళ నేను ఏర్పరుచుకున్న అభిప్రాయం కాదు ..నేను అనుకున్నది జరగాలి అంటే పెళ్లి నాకు ప్రతిబంధకం అవ్తుంది …” అన్నాడు …
అర్ధం కాలేదన్నట్టు చూసాను ….నా చూపు కి సమాధానం గా ..”నాకు పది ఏళ్ళు ఉన్నప్పుడు ..మా అక్కకి 18 ఏళ్ళు ..మాది చిన్న పల్లెటూరు ..మది చిన్న రైతు కుటుంబం … ఎవరు చెప్పినా వినకుండా మా అమ్మ, నాన్న మా అక్కకి 16 ఏళ్ళు నిండకుండా పెళ్లి చేసారు ..మా పక్క ఊరి అతనికే ఇచ్చారు ..సంవత్సరం తిరగకుండా తనకి ఒక పాప పుట్టింది …అకస్మాతు గా ఒక రోజు మా అక్క పిల్ల ని ఎతుకుని మా ఇంటికి వచేసింది ..ఏమైందని అడిగితే మా బావ , వాళ్ళ అమ్మ కట్నం కోసం పెట్టే కష్టాలు భరించలేక వచ్చాసాను అని చెప్పింది ..మొదటి రెండు రోజులు ఎవరూ ఏమి అనలేదు ..కానీ ఆ తర్వాత ఊరందరి ముందు కూతురు ఇంటికి తిరిగి వచ్చేసిందంటే అవమానంగా ఉంటుందని అమ్మ, నాన్న తనకి నెమ్మది గా సర్ది చెప్పటం ప్రారంభించారు కానీ తను వినలేదు ..ఆ ఇంటికి తను తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పింది …
తను అలా మాట్లాడుతుందని ఎవరూ ఊహించలేదు ….తనని తిరిగి తీసుకు వెళ్ళటానికి కూడా ఎవరూ రాకపోయేసరికి నాన్నకి బాగా కోపం వచ్చింది ..అక్కతో మాట్లాడటం మానేసారు ..
ఒక రోజు ఏదో కోపం లో, అక్క భోజనం చేస్తూ ఉంటే నా మాట విననిదానికి ఈ భోజనం మాత్రం కావాలా అని ఆయన అనేసరికి అక్క నొచ్చుకుంది ….ఆ రాత్రి అందరూ నిద్ర పోతున్న వేళ పిల్ల ని తీసుకుని బావిలోకి దూకేసింది …చనిపోతూ తన ఉత్తరం లో ..”నీ ఇంటి భోజనం నాకే దండగ అనుకుంటున్నా వాడివి నా కూతురు మాత్రం నీకెందుకు భారం కావాలి నాన్న …అందుకే నా వెంటే తెసుకేల్తున్నా” అంటూ రాసింది …
అంత జరిగాక ..నాన్న తనే అక్క చావు కి కారణం అని మంచాన పడ్డారు …అమ్మ మాత్రం నా కోసం ఐనా తను బ్రతకాలని ..అన్ని దుఖాలని దిగ మింగుకుని బ్రతికింది ..నన్ను బాగా చదివించింది …
ఆ రోజు మా అక్క ఆవేశానికి లోను అయ్యి చేసిన పని మరి యే ఆడపిల్ల చేయకూడదు అంటే ..ఆడపిల్లలు కూడా అబ్బాయిలతో సమానంగా చదువుకోవాలని …సరైన ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలని అర్ధం అయ్యింది ..
అందుకే చనిపోయిన మా అక్కకి ఏం చేయలేకపోయినా ..ఇద్దరు ఆడపిల్లలని దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకోవాలి అనేది నా కోరిక …” అన్నాడు అనంత్ …అతని కళ్ళలో సన్నని నీటి పొర తెలుస్తోంది
అతను నన్ను కాదనలేదని ..కేవలం అతని గొప్ప ఆశయం గురించే ఆలోచిస్తున్నాడు అనే సరికి ..నా ప్రవర్తనకి నాకే సిగ్గు వేసింది …
“ నీ ఈ ప్రయత్నం లో నేను భాగస్తురలిని కావటం లో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు …నీకు నేను నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను ..” అని నేను పూర్హి చేసీ లోపే ….
“ నాకు తెలుసు నువ్ ఎంత సహ్రుద్యరలివో ….i understand you..కానీ ప్రతి స్త్రీ జీవితంలో తల్లి కావటం ఒక గొప్ప అదృష్టం …ఇప్పుడు నువ్ ఉద్వేగానికి లోను అయ్యి నాతో సరే అన్నా ..జీవితంలో ఏదో ఒక క్షణంలో ఆ పిల్లలు నీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కాదు అనిపిస్తే ..నీకు, వారికీ మధ్య గ్యాప్ వచ్చేస్తుంది …
పైగా నా ఆశకి నువ్వు బలి కాకూడదు ….నా వల్ల నువ్వు మాతృత్వన్నికి దూరం కాకూడదు ..దయ చేసి నన్ను అర్ధం చేసుకో అన్నాడు ..” నా కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ….
“అనంత్ , ప్రతి స్త్రీ లో ను మాతృత్వం దాగి ఉంటుంది ..అది కేవలం biological గా బిడ్డ పుట్టినపుడే కలగదు …ప్రకృతిలో ప్రతి సున్నితమైన అంశం పట్ల స్పందించటం మాతృత్వమే ఆవ్తుంది …
అందమైన పూలు ఎవరైనా నిర్దాక్షిణ్యం గా కోసేసిన ,చిన్న పిల్ల వాడు ఏడుస్తున్న , శత్రువు కి ఐనా కాస్త గట్టి దెబ్బ తగిలినా …యే ఆడపిల్ల తట్టు కోలేదు …
అది ఒక బిడ్డ కలిగాక మాత్రమే ఆ భావనలు కలగవు ..పుట్టుక తో కలిగే భావనలు …అలాంటిది ఇద్దరు చిన్నారి పిల్లలకి కేవలం నేను biological గా జన్మ నివ్వ లేదు కాబట్టి తల్లిని కాలేను అని నువ్ అనుకోవటంలో అర్ధం లేదు ..అనంత్ ” అన్నాను ..అతనికి అర్ధం అయ్యేలా చెప్పానో లేదో అనుకుంటూ ..
నన్ను ఏదో కొత్త గా చూసినట్టు నా వైపు చూసాడు …….
“ నాకేం మాట్లాడాలో తెలీట్లేదు ..నీ మాటలతో ఇన్ని రోజుల నా ఆలోచనలూ తప్పా అనిపిస్తున్నై …” అన్నాడు ..
“ నీ ఆలోచనలో తప్పు అని నేను అనట్లేదు …నువ్వు కేవలం నీ వల్ల ఎవరు అన్యాయం కాకూడదనే నిస్వార్థంగా అలోచించావ్ అంతే ..కానీ నీ లాగే ఆలోచించే అమ్మాయి ఉంటుందని నువ్ ఊహించలేదు అంతే ” అన్నాను నవ్వుతు …
“ ..అయితే ఇపుడు ఏమంటావ్ ? “ అన్నాడు ..నేను ఎం చెప్తే అదే చెయ్యటానికి సిద్దం అన్నట్టు ..
“ ముందు ఇంటికి వెళ్దాం ..నాన్నకి చెప్పాలి ఇదంతా ..ఆ తర్వాత ..నువ్ కోరుకున్నట్టే ఇద్దరు అందమైన తెలివిగల నాలాంటి ఇద్దరు ఆడపిల్లలని ఇంటికి తెచ్చుకుందాం …గోదావరి ..అనంత్ లాగా కాకుండా .వాళ్ళ అమ్మ నాన్న గా ”..అన్నాను
ఈ సారీ నవ్వటం తన వంతు అయింది …” మొత్తానికి ఆ గోదావరి ఒడ్డునే . .ఈ గోదావరి సొంతం అయ్యాను అన్న మాట ”..అన్నాడు …
మా ఇద్దరి నవ్వులు గల గల మంటూ ..శ్రుతి కలిపాయి …అనంతమైన గోదావరితో …..
ఈ సారీ నా తిరుగు ప్రయాణం ఒంటరిగా కాకపోయినా ..నాకెంతో నచ్చింది ..కారణం మీకు తెలుసు అనుకుంట …